తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు మండలం మందడంలో ఓ ఇంట్లో ఉంచిన 96 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందడంలో వారం రోజులుగా ముగ్గురు వ్యక్తులు అనధికారికంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. తాడేపల్లి మండలం పెనుమాకలోనూ తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
మందడంలో తెలంగాణ మద్యం సీజ్.. ముగ్గురు అరెస్ట్ - guntur dst taja news
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 96మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
telangana liquor seized in guntur dst mandam