గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో 5 కేసుల తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా గుర్తించిన గ్రామ వాలంటీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు మద్యం సీసాలను వదిలి బైక్ తో పరారయ్యారు. మద్యం విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
దాచేపల్లిలో తెలంగాణ మద్యం పట్టివేత - latest news of telangana liquor
తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లికి తెస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామవాలంటీర్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
telangana liquor seized in guntur dst dacepalli