గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ వద్ద ట్రాక్టర్లో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గురజాల ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే తంగెడ వద్ద సదరు ట్రాక్టర్ను అడ్డగించగా.. ఆపకుండా మా వాహనంపైకి ఎక్కించే ప్రయత్నం చేశారని గురుజాల ఇన్ఛార్జీ ఎస్సై కొండారెడ్డి పేర్కొన్నారు. అంతలో ట్రాక్టర్పైన ఉన్న నలుగురు దిగి పారిపోతుండగా ఒకరిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కాలువలో పడ్డ వాహనాన్ని పరిశీలించగా 1920 తెలంగాణ మద్యం సీసాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
1920 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత - Telangana liquor bottles seized
ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 1920 సీసాల తెలంగాణ మద్యాన్ని గుంటూరు జిల్లా తంగెడ వద్ద గురజాల ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు.
Telangana liquor seized in Guntur district