TS High court verdict in CM Jagan case: అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జగన్ షరతులు ఉల్లంఘిచారంటూ.. ఆయన బెయిల్ రద్దు చేయాలని గతంలో రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు..జగన్ బెయిల్ రద్దుకు నిరాకరించింది. గతంలోనే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. రఘురామ పిటిషన్ కొట్టివేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించారు.
సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు - AP Chief Minister Jagan
TS High court verdict in CM Jagan case: జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురామ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.
ts high court