NGT imposed fine on Telangana Govt: పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి.. జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ భారీ జరిమానా విధించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం అంటే సుమారు రూ. 900 కోట్ల వరకు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. పర్యావరణం సహా అనేక అనుమతులు లేవని ప్రాజెక్టు నిర్మాణాలు నిలుపుదల చేయాలంటూ.. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదని ఎన్జీటీలో.. వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ సర్కార్కు షాక్.. రూ.900 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ - andhra pradesh news
NGT imposed fine on Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ భారీ జరిమానా విధించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం అంటే సుమారుగా 900 కోట్ల రూపాయలు జరిమానాగా వేస్తూ తీర్పు ఇచ్చింది.
జాతీయహరిత ట్రైబ్యునల్
దీనిపై కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నట్లు తీర్పులో ఎన్జీటీ చెన్నై పేర్కొంది.
ఇవీ చదవండి: