Telangana Assembly sessions in December : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభను సమావేశపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... అందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. తెలంగాణపై కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షలతో... ఈ ఆర్థికఏడాదిలో రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో 40వేల కోట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ చర్యలతో తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని ఆరోపిస్తోంది.
Telangana Assembly sessions : డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ సమావేశాలు - Telangana Assembly sessions update
కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మద్య ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నడుమ.. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్‌లో వారం రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం.. ఆసక్తిగా మారింది. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంపై అందరి దృష్టి నెలకొంది.

డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ సమావేశాలు
అన్ని విషయాలను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు వీలుగా... శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్‌లో సమావేశమైన ఉభయసభలు ఇప్పటి వరకు ప్రోరోగ్ కాలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే తాజా సమావేశాలు కూడా జరగనుండటంతో... ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా... సభాపతి, మండలి ఛైర్మన్ల ఆదేశాలతో... సమావేశాల నిర్వహణపై శాసనసభ సచివాలయం సభ్యులకు సమాచారం అందించనుంది.