గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్య ఏళ్ల తరబడి పొలం గట్టు వివాదం కొనసాగుతోంది. పొలం సరిహద్దు గట్ల విషయంలో సమస్య పరిష్కారానికి అధికారుల నుంచి స్పందన కొరవడింది.
ఈ నేపథ్యంలో వీఆర్వో, సర్వే సిబ్బందితో కలిసి రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న పొలంలో నడుచుకుంటూ వెళ్లి న తహసీల్దార్ వెంకటేశ్వర్లు... వివాదంలో ఉన్న పొలాన్ని పరిశీలించారు. పొలం యజమానులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమిని కచ్చితంగా కొలత వేసి ఎవరి భాగాన్ని వారికి చట్టబద్ధంగా అప్పగించాలని రెవెన్యూ బృందానికి ఆదేశాలు జారీ చేశారు.