ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TEACHERS PROTEST: పీఆర్​సీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన - teachers unions protest in chittoor district

TEACHERS PROTEST: వేతన సవరణలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఫిట్‌మెంట్, హెచ్​ఆర్ఏ తగినంత ఇస్తే చాలని ఉపాధ్యాయ నేతలు అన్నారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

పీఆర్​సీ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన
పీఆర్​సీ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Jan 11, 2022, 3:23 PM IST

TEACHERS PROTEST: 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడాన్ని నిరసిస్తూ రెండో రోజూ ఉపాధ్యాయ సంఘాలు గుంటూరులో ఆందోళనకు దిగాయి. ఏపీటీఎఫ్, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తాలూకా సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. పదవీ విరమణ వయస్సు పెంపు అవసరం లేదని.. ఫిట్‌మెంట్, హెచ్​ఆర్ఏ తగినంత ఇస్తే చాలని ఉపాధ్యాయ నేతలు అన్నారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లాలో...

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్​సీని నిరసిస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పీఆర్సీని పునఃసమీక్షించాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:RGV TWEET: సినిమా టికెట్‌ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details