విద్యార్థులున్నారు సరే.. ఉపాధ్యాయులేరి? - undefined
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి.. నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు, అన్ని వసతులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. సౌకర్యాల మాట సరే సరి. కనీసం విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించకుండా ఇద్దరు ఉపాధ్యాయులతోనే నెట్టుకొచ్చేస్తున్నారు విద్యా సంవత్సరాన్ని. ప్రస్తుతం ఈ పరిస్థితి గుంటూరు జిల్లా కాకుమానులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
![విద్యార్థులున్నారు సరే.. ఉపాధ్యాయులేరి?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3995001-69-3995001-1564540435465.jpg)
గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక పాఠశాలలో గతం 40 మంది విద్యార్థులుండేవారు. అధికారులు ఊరిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరటంతో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 70 కి చేరారు. అయితే... ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాల్సిన పాఠశాలలో ఇద్దరే టీచర్లు ఉండటం,... తరగతి గదులు సైతం లేకపోవటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అక్కడ ఉండే ప్రధానోపాధ్యాయుడు పదోన్నతిపై వెళ్లిపోవటంతో బోధన మరింత కష్టమైపోయిందని ఉపాధ్యాయిని మాధవి వాపోయారు. డిప్యుటేషన్‌పై ఒక టీచర్‌ను అధికారులు నియమించినా, కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే మంచి బోధన చేయవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.
TAGGED:
teachers shortage at guntur