రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకు ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయ్యాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ పేరుతో కొన్ని ఖాళీలను బ్లాక్ లో ఉంచుతున్నారన్నారు. ఉపాధ్యాయ బదిలీలు సాధారణ విధానంలోనే చేపట్టాలన్నారు.
'ఉపాధ్యాయ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి' - ap teachers tranfer problems
ఉపాధ్యాయులకు బదిలీలలోను న్యాయం జరగడం లేదని ఉపాధ్యయ సంఘాలు ఆరోపించాయి. గుంటూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేయ్యాలని కోరారు.
teachers protest at guntur
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వీరంగం...టోల్గేట్ సిబ్బందిపై దాడి