మార్చిలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో... ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని రామకృష్ణ కోరారు.
గతంలో పనిచేసినట్లే నీతి, నిజాయతీతో పనిచేస్తానని... ఉపాధ్యాయల సమస్యలపై మండలిలో పోరాడుతానని చెప్పారు. ఉపాధ్యాయల సమస్యలు తెలియని వారు పోటీ చేయడం సరికాదని అన్నారు. అర్హత, అనుభవం లేని వారు ఉపాధ్యాయల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మరోసారి తనను గెలిపిస్తే.. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు.