గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో..విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఉపాధ్యాయుడిపై బంధువుల దాడిని (attack on teacher).. ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. పాఠశాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే.. ప్రధానోపాధ్యాయుడు, పోలీసులకు ఫిర్యాదు చేయాలిగానీ.. ఉపాధ్యాయునిపై భౌతికదాడి చేయడం (attack on teacher) దారుణమని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బాధిత ఉపాధ్యాయుడు రవిబాబు మంచి వ్యక్తి అని.. అతని సర్వీసులో సేవా కార్యక్రమాలు చాలా చేశారని సుధీర్ అన్నారు. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరితను కలిసి ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని కోరతామన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని ఆదేశాల మేరకు.. డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు ఘటనపై విచారణ చేపేట్టేందుకు పాఠశాలకు వెళ్లారు. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.
'రవిబాబు మంచి వ్యక్తి . అతని సర్వీసులో సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే.. ప్రధానోపాధ్యాయుడుకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలిగానీ.. ఉపాధ్యాయునిపై భౌతికదాడి చేయడం దారుణం. ఉపాధ్యాయులపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్ చేయాలి' -ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ జోసఫ్ సుధీర్
అసలేం జరిగింది..