Teachers concern in AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో యూటీఎఫ్ నాయకులు తమ పాఠశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అవలంబిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మాట తప్ప... మడమ తిప్పనన్న జగన్‌మోహన్ రెడ్డి... నేడు మాట తప్పి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"మాట తప్ప.. మడమ తిప్పనన్న జగన్‌మోహన్ రెడ్డి... నేడు మాట తప్పారు" - Teachers problems
Teachers concern in AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
Teachers concern in AP
పీఆర్సీలో సైతం హెచ్ఆర్ఏలను తగ్గించి.. పెన్షన్లు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు విధానంపై నిరసనకు వెళ్తున్న వారిని నిర్బంధం చేయటం... ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించటం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Lokesh News: తెదేపా అలా చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా ?: లోకేశ్