ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sexual Harassment: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు !

పాఠాలు చెప్పాల్సిన గురువే..పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కూతురు లాంటి దానివి అంటూనే..ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు
పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు

By

Published : Oct 18, 2021, 9:19 PM IST

బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్ విద్యార్థిని పట్ల వికృతంగా ప్రవర్తించాడు. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైన పనికి దిగజారాడు.

వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా పిడుగురాల్లోని ఓ ప్రయివేట్ పాఠశాల ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో విద్యార్థిని బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడుని బయటకు లాగి పోలీసులకు అప్పగించారు.

పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు

ఫోక్సో కేసు నమోదు

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శివారెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పిడుగురాళ్ల సీఐ ప్రభాకర్ వెల్లడించారు. ఘటనపై విచారణ చేపట్టి నిందితుడికి శిక్షపడేలా చూస్తామన్నారు.

ఇదీ చదవండి

కోర్టు ప్రాంగణంలోనే న్యాయవాది దారుణ హత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details