"అంతర్జాతీయ పితృ దినోత్సవం" సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనలోని సృజనకు పదును పెట్టారు. తెనాలి మండలం పెదరావురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పణిదెపు వెంకట కృష్ణ... చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలను తీసుకెళ్తున్న ఓ తండ్రి చిత్రాన్ని.. రావి ఆకుపైన చిత్రీకరించారు. ఆ ముగ్గురి రూపాలతో పాటు "నాన్నకు ప్రేమతో " అనే అక్షరాలు వచ్చేలా ఆకును కత్తిరించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేశారు. జూన్ 21 ఫాదర్స్ డే సందర్భంగా తనలోని కళను మరోసారి బయటపెట్టారు.