గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారావు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మూడో తరగతి చదువుతున్న తమ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయునిపై కేసు నమోదు చేశారు. సుబ్బారావు సోమవారం నుంచి 3రోజులపాటు సెలవుల్లో ఉన్నాడని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు.
ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలి - tulluru
మూడోతరగతి విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యయుడు లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబీకులు ఆందోళన నిర్వహించారు.

ఆందోళన
ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలని తల్లిదండ్రుల ఆందోళన
ఇది కూడా చదవండి.
200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!