ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి - ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి తాజా వార్తలు

గుంటూరు జిల్లాలోని పిట్టలవానిపాలెంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. గుండెపోటుతో మరణించాడు. పోలింగ్ బూత్​కు వెళ్లే క్రమంలో.. గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

death
ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి

By

Published : Apr 8, 2021, 10:29 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ముత్తుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో.. కంచర్ల కోటేశ్వరరావు ఆంగ్ల ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు అతను పిట్టలవానిపాలేనికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం పోలింగ్ బూత్​కు వెళ్లే క్రమంలో.. అతనికి గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది.. బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details