ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాడు- నేడు పనుల వల్లే ఉపాధ్యాయుడు మృతి' - aptf guntur distrcit news

నాడు- నేడు పనుల్లో అవినీతి జరుగుతోందని గుంటూరు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు బసవలింగరావు ఆరోపించారు. రాజకీయ నాయకులు అధిక బిల్లులు రాయాలంటూ ఒత్తిడి చేయటం వల్లే రాజుపాలెం మండలంలో ఉపాధ్యాయుడు మల్లెల శేఖర్ బాబు మృతి చెందాడని ఆయన అన్నారు.

teacher died due to nadu nedu works
teacher died due to nadu nedu works

By

Published : Jun 26, 2020, 8:04 PM IST

మీడియాతో బసవలింగరావు

పాఠశాలలో నిర్వహిస్తున్న నాడు- నేడు పనుల్లో రాజకీయ ఒత్తిళ్లు బాగా పెరిగాయని... అవి తట్టుకోలేకే రాజుపాలెం మండలంలో ఉపాధ్యాయుడు మల్లెల శేఖర్ బాబు మృతి చెందాడని గుంటూరు జిల్లా ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్)అధ్యక్షుడు బసవ లింగరావు ఆరోపించారు.

నాడు- నేడు పనుల్లో ఉపాధ్యాయుడు శేఖర్​పై స్థానిక తల్లిదండ్రుల కమిటీ, పెద్దలు అధిక చెల్లింపులు చేయాలని ఒత్తిడి తెచ్చారని బసవలింగరాజు చెప్పారు. దీనివల్లే ఆయన మృతి చెందారని... బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయులపై నిర్మాణ బాధ్యతలు పెట్టడం సరికాదన్నారు. ఏఈలు కనీసం పాఠశాలలకు వచ్చి పనుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నోడల్ అధికారులు మాత్రం బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ బాధ్యతల నుంచి ప్రధానోపాధ్యాయులను తప్పించి పర్యవేక్షణకే పరిమితం చేయాలని...లేకపోతే తమ యూనియన్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:చెల్లింపులే జరగనప్పుడు అవినీతి ఎక్కడిది: నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details