గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్ఘణ చోటుచేసుకుంది. నగరంలో ఓ ప్రైవేటు ఛానల్లోప్రజా చర్చావేదికలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై చర్చ జరగుతుండగా... అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీఆంజనేయులు,వైకాపాకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మనాయుడు మధ్య వాగ్వాదం మొదలైంది. సంయమనం కోల్పోయిన వైకాపా, తెదేపా శ్రేణులు.. ఒకరి మీద ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు. వైకాపా యువజన నాయకుడు.... అధికార పార్టీ ఎమ్మెల్యేపై రాడ్ విసిరారు. సహనం కోల్పోయిన తెదేపా వర్గీయులు ఆగ్రహాంతో ముందుకు వచ్చారు. ఇరువర్గాల కార్యకర్తలు తోపులాటకు దిగారు. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలకు తీవ్ర గాయం అయ్యింది. పోలీసులు కలుగజేసుకుని వారిని శాంతపరిచి.. క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.
తెదేపా - వైకాపా బాహాబాహీ - guntur
అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరి మీద ఒకరు కుర్చీలు విసిరారు.
తెదేాపా, వైకాపా ఘర్షణ
Last Updated : Feb 28, 2019, 11:11 AM IST