ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP workers hold protest against CBN arrest చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పూజలు, రిలే దీక్షలు, నిరసనలు.. - టీడీపీ నేత సవిత చేపట్టిన ఆమరణ దీక్ష

TDP workers hold protest against CBN arrest: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ... టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పలు చోట్ల దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలకు జనసైనికులు సైతం మద్దతు తెలిపారు.

TDP workers hold protest against CBN arrest
TDP workers hold protest against CBN arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 9:14 PM IST

TDP workers hold protest against CBN arrest: చంద్రబాబు అరెస్టయినప్పుడు మొదలైన ఆగ్రహ జ్వాలలు నేటికీ రాష్ట్రవ్యాప్తంగా రగులుతూనే ఉన్నాయి. ఆలయాల్లో పూజలు, రిలే నిరహార దీక్షలు, నిరసనలతో తెలుగుదేశం శ్రేణులు హోరెత్తించారు. బాబు విడుదలయ్యే వరకు నిరసనలకు విరామం ప్రకటించేది లేదంటూ కదం తొక్కారు. చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమ సంఘీభావం తెలిపారు. పెనమలూరులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శ్రేణులు అరగుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలకు జనసైనికులు మద్దతు తెలిపారు. అద్దంకిలో మేము సైతం బాబు కోసమంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుకు రాజధాని రైతులు లేఖలు రాశారు. మీరు ఎలాంటి అవినీతి చేయలేదని నమ్ముతున్నామని లేఖలో పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను చూడలేకే, అక్రమంగా అరెస్టు చేశారంటూ... నెల్లూరులో శ్రేణులు నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుతూ... తిరుపతి జిల్లా రేణిగుటలోని కట్టా పుట్టాలమ్మ ఆలయంలో శ్రేణులు కొబ్బరికాయలు కొట్టి... ప్రత్యేక పూజలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్లపై కూర్చుని... ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయదేవత ముందు భిక్షాటన చేస్తూ... శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు.

Protests Against Chandrababu Arrest: బాబు కోసం ఆగని నిరసనలు.. అధినేతను విడుదల చేయాలంటూ పూజలు, ర్యాలీలు, దీక్షలు



శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేత సవిత చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజూ కొనసాగింది. హిందూపురంలో తెలుగు మహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుతూ... అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో శ్రేణులు 101 టెంకాయలు కొట్టారు. ఉరవకొండలో దీక్షా శిబిరం నుంచి క్లాక్‌ టవర్‌ వరకు... భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా అనంతపురంలో సర్పంచులు గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.


Huge Protest in Karnataka against Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా కర్ణాటకలో కొనసాగుతున్న నిరసనలు

ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవేదులోని దీక్షా శిబిరం నుంచి హనుమాన్ జంక్షన్‌ ఆంజనేయస్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి.. కొబ్బరికాయలు కొట్టారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్న పాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం దున్నపోతులా వ్యవహరిస్తోందంటూ, ఓ దున్నపోతుని తీసుకొచ్చి వినతిపత్రం అందించారు.

శ్రీకాకుళం జిల్లాఆమదాలవలస మండలం ముద్దాడ వద్ద నాగావళి నదిలోకి దిగి టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థానికి భారీగా వెళ్లిన శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదలవ్వాలని కోరుకుంటూ.... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని కోట దుర్గమ్మకు మహిళలు పసుపు నీళ్లతో అభిషేకం చేశారు.


Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో హోరెత్తిన నిరసనలు

ABOUT THE AUTHOR

...view details