ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత నన్నపనేని రాజకుమారి తలకు గాయం - తెదేపా మహిళా నేత నన్నపనేని రాజకుమారికి గాయాలు

తెదేపా మహిళా నేత నన్నపనేని రాజకుమారి తలకు గాయమైంది. వర్షం కురుస్తున్న సమయంలో తన ఇంటి ఆవరణలో జారి పడ్డారు. తలకు గాయంతో చికిత్స పొందుతున్నారు.

tdp woman leader Nannapaneni
tdp woman leader Nannapaneni

By

Published : Sep 26, 2020, 4:50 PM IST

తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తలకు గాయమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని తన ఇంటి ఆవరణలో జారి పడ్డారు. వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లోకి వస్తుండగా తడి రాళ్లపై కాలు వేయబోయి.. జారిపడగా ఆమె తల గోడకు తగిలి గాయమైంది.

గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైన చోట వైద్యులు కుట్లు వేశారు. గాయం చిన్నదేనని.. పెద్దగా ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం తెనాలిలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నన్నపనేని ఆరోగ్యంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరా తీశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details