ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుర పోరు: గుంటూరు తెదేపాలో వర్గ విభేదాలు.. రంగంలోకి అచ్చెన్న - గుంటూరు టీడీపీలో వర్గ విభేదాలు

గుంటూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు శ్రావణ్, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇతర నేతలతో అచ్చెన్న సమావేశమయ్యారు. చంద్రబాబు సూచనల మేరకు సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు.

achennaidu meeting with tdp leaders
తెదేపా నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం

By

Published : Feb 25, 2021, 4:42 PM IST

గుంటూరు నగరపాలక ఎన్నికల్లో తెదేపా నేతల మధ్య విభేదాలు చక్కదిద్దేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చర్యలు చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​లో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు శ్రావణ్, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇతర నేతలతో కలిసి సమస్య పరిష్కారంపై చర్చించారు.

గుంటూరులో 37, 42 డివిజన్లలో తెదేపా అభ్యర్థుల పోటీపై ఇబ్బందులు తలెత్తాయి. తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర 37వ డివిజన్​లో నామినేషన్ దాఖలు చేశారు. అదే డివిజన్​లో గతంలో రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన ముత్తినేని రాజేశ్​ సైతం నామినేషన్ వేశారు. రాజేశ్​ 42వ డివిజన్​లోనూ నామినేషన్ దాఖలు చేశారు. అక్కడే తెదేపాకు చెందిన వేములపల్లి శ్రీరామప్రసాద్ కూడా నామపత్రాలు దాఖలు చేశారు. ఆయన అక్కడ గతంలో కార్పొరేటర్‌గా పని చేశారు. ఈ రెండు డివిజన్ల మధ్య వివాదం ఏర్పడటంతో అధినేత సూచనల మేరకు సమస్య పరిష్కారం దిశగా అచ్చెన్నాయుడు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పంచాయతీ ఎన్నికల ఫలితాల 'ఉత్కంఠ'..!

ABOUT THE AUTHOR

...view details