Gouthu Sireesha Comments: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఇటీవల సీఐడీ కేసు ఎదుర్కొన్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సీఐడీతో ఎన్ని కేసులు పెట్టినా.. తెలుగుదేశం సైనికులు భయపడరని అన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుందని.. ఆ హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందని అభిప్రాయపడ్డారు. అత్యున్నత ప్రమాణాలతో మెలగాల్సిన సీఐడీ విభాగం ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారి.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వం చేతిలో సీఐడీ కీలుబొమ్మగా మారింది: గౌతు శిరీష - రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
gouthu sireesha: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఇటీవల సీఐడీ కేసు ఎదుర్కొన్న రావిపాటి సాయి కృష్ణను పరామర్శించారు. అనంతరం సీఐడీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
tdp