సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదని గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అమరావతి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన కమిటీ సమావేశంలో శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయని శ్రావణ్ కుమార్ అన్నారు.
'రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు' - News on amravathi protest
అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని ఆరోపించారు.
గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్