పట్టాభి
'ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులను మోసం చేస్తున్నారు' - cm jagan latest news
వైకాపా ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాలను తుంగలో తొక్కిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. వివిధ పథకాల కింద విద్యార్థులకు 37 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాలని పేర్కొన్నారు. కేవలం 12,400 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. 25 వేల కోట్ల రూపాయలు కోత పెట్టి విద్యార్థులను ముఖ్యమంత్రి మోసం చేశారని ధ్వజమెత్తారు. తెదేపా పథకాలకే వైకాపా కొత్త ముసుగు వేస్తోందని దుయ్యబట్టారు. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
!['ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులను మోసం చేస్తున్నారు' TDP Spokesperson pattabhi criticize cm Jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6203256-513-6203256-1582650509489.jpg)
పట్టాభి