ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BAIL: ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు: జ్యోతిశ్రీ - tdp news

ముఖ్యమంత్రి కుటుంబీకులపై అనుచిత పోస్టులు పెట్టారంటూ సీఐడీ అధికారులు అరెస్ట్​ చేసిన తెదేపా సామాజిక మాధ్యమ కార్యకర్త జ్యోతిశ్రీకి న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది. తన అరెస్ట్.. కేవలం రాజకీయ కక్షతో చేసినదేనని ఆమె ఆరోపించారు.

ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు
ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు

By

Published : Aug 4, 2021, 10:53 PM IST

వైకాపా ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను సీఐడీ (CID) పోలీసులు అరెస్టు చేశారని తెనాలికి చెందిన తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త జ్యోతిశ్రీ ఆరోపించారు. సోషల్ మీడియాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించి.. అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణపై జ్యోతిశ్రీని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. గుంటూరులోని సీబీసీఐడీ (CBCID) కోర్టులో ఆమెను హాజరుపరిచారు.

ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారన్న జ్యోతిశ్రీ

ఆమెకు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో జ్యోతిశ్రీ విడుదలయ్యారు. తన అరెస్టు కేవలం రాజకీయ కక్షతో చేసినదేనని ఆమె అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భయపడబోమని అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను ఇంటి నుంచి సీఐడీ కార్యాలయానికి విచారణ పేరుతో తీసుకెళ్లారని ఆరోపించారు. తాను పెట్టిన పోస్టుల్లో ఎలాంటి అసభ్యకర పదజాలం లేదని.. తెదేపా సైనికులుగా తమకు క్రమశిక్షణ ఉందని జ్యోతిశ్రీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details