వైకాపా ప్రభుత్వ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ చేతగానితనం కారణంగా తెనాలిలో నిమ్మకాయలు రోడ్డుపై వేస్తున్నారని... దుగ్గిరాలలో పసుపు కొనే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండినా... సాగునీటి సరఫరా మాత్రం అస్తవ్యస్థంగా ఉందన్నారు. వ్యవసాయం, పంటలకు సాగునీటి సరఫరా వంటి అంశాలపై ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా అని ఆలపాటి ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో ప్రజల నోరు మూసేశారని... రంగులు మార్చే పథకాన్ని మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బూతులు తిట్టే పథకాన్ని కొత్తగా అమలు చేస్తున్నారని విమర్శించారు.
'బూతులు తిట్టే పథకాన్ని వైకాపా అమలు చేస్తోంది' - వైసీపీపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు న్యూస్
వైకాపా ప్రభుత్వంపై తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేతగానితనం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
tdp senior leader alapati rajendraprasad comments on ycp govt