TDP SC CELL LEADERS PROTEST : ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయ ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం SC సెల్ నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి బయల్దేరిన నేతలను.. పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీనికి నిరసనగా.. జాతీయ రహదారిపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సీలకు.. జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారని.. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్.ఎస్. రాజు ప్రశ్నించారు. దళితుల అభివృద్ధి కోసం.. గతంలో తెచ్చిన 27 పథకాలు నిలిపివేశారని మండిపడ్డారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎస్సీ సెల్ నేతలను అడ్డుకున్న పోలీసులు - టీడీపీ ఎస్సీ సెల్ నేతల నిరసన
TDP SC CELL LEADERS PROTEST : ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయ ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం SC సెల్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా.. జాతీయ రహదారిపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

TDP SC CELL LEADERS PROTEST
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎస్సీ సెల్ నేతలను అడ్డుకున్న పోలీసులు