''కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణం'' - tdp rally in ap
మాజీ సభాపతి కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ తెదేపా నాయకులు ర్యాలీలు చేపట్టారు. కర్నూలు, విజయవాడలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు.
మాజీ సభాపతి కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ..తెదేపా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా...ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. విజయవాడలో నల్ల చొక్కాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో.. నల్లబ్యాడ్జీలు ధరించి మౌనం పాటించారు. కోడెల మృతికి సంతాప సూచకంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపానాయకులు ర్యాలీ చేపట్టారు. మీడియాపై ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెదేపా నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మరిన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు.
TAGGED:
tdp rally in ap