మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సరికాదని... గుంటూరు జిల్లా ఫిరంగిపురం తెదేపా శ్రేణులు అన్నారు. ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి, అంబేడ్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటానికి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెదేపా నేతలతోపాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
'అచ్చెన్నాయుడు అరెస్ట్ సరికాదు' - ఫిరంగిపురంలో తెదేపా ఆందోళన వార్తలు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అచ్చెన్నను అరెస్ట్ చేసిందని తెదేపా నాయకులు విమర్శించారు.

అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆందోళన