TDP Protests and Dharnas Against Chandrababu Arrest:చంద్రబాబు అరెస్టుకు నిరనసగా తెలుగుదేశం(TDP Protests) ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాబు ఆరోగ్యం కుదుటపడాలని విజయవాడ గుణదల మేరీ మాత గుడిలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన 200 మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ వాళ్లు చేసే ప్రతి చర్యకూ ప్రతి చర్య ఉంటుందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. బాబు ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
మాజీ ఎంపీ కొనకళ్ల ఇందులో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక గంగానమ్మ ఆలయంలో మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు(Special Pujas for Chandrababu) చేశారు. బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెనమలూరు నియోజకవర్గం కామయ్యతోపు కూడలిలో గంగానమ్మ ఆలయంలో పూజలు జరిపారు.
బాపట్ల జిల్లా వల్లాపల్లి నుంచి బల్లికురవలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 8వ రోజు సైకిల్ యాత్ర చేశారు. చంద్రబాబు అక్రమ(Chandrababu Arrest) అరెస్టుతో వైసీపీ పతనాన్ని కోరితెచ్చుకుందని మండిపడ్డారు. పర్చూరు నుంచి కోటప్పకొండ వరకుటీడీపీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీచేశాయి. బొమ్మలకూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేశారు. వినాయక ఆలయంలో పూజలు చేశారు. అన్నంబొట్ల వారిపాలెం, పసుమర్రు, చిలకలూరిపేట, మద్దిరాల మీదుగా బైక్ ర్యాలీ సాగింది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సీతారామ ఆలయంలో పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో 300 గుమ్మడి కాయలు కొట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలని నినదించారు. అన్నమయ్య జిల్లా చిట్వేలులో టీడీపీ, జనసేన నాయకులు సత్యమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. చిట్వేల్ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.