విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు ఆధ్వర్యంలో దాదాపు 50 మంది యువకులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన పార్టీ నేతలు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్నారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం ప్రకటించారు.
విదేశీ విద్య పథకానికి తన పేరు పెట్టుకోవడానికి జగన్కు ఉన్న అర్హతేంటి - విదేశీ విద్య పథకానికి తన పేరు పెట్టుకోవడానికి జగన్కు ఉన్న అర్హతేంటి వార్తలు
విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన పార్టీ నేతలు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్నారు.
సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపటి నుంచి రాష్ట్రమంతా నిరసన దీక్షలు చేపడతామని ఎమ్మెస్ రాజు చెప్పారు. ఆర్థిక ఉగ్రవాదైన ముఖ్యమంత్రి జగన్.. విదేశీ విద్య పథకానికి తన పేరు పెట్టుకోవడానికి ఏ అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. దళితుల ఆత్మబంధువైన అంబేడ్కర్ పేరును ఎందుకు కొనసాగించలేదని నిలదీశారు. ప్రభుత్వానికి తాము ఇచ్చిన గడువు పూర్తయినందున నిరసన దీక్షకు దిగామని చెప్పారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని అప్పటివరకు ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి