పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో మాజీమంత్రి పుల్లారావు ఆదేశాలతో విద్యుత్ బిల్లుల పెంపునకు నిరసనగా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.
'పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలి' - 'పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి'
లాక్ డౌన్ అమలు చేసిన మూడు నెలలు విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా తెదేపా నేతలు నిరసన చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళన చేపట్టారు.
'పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి'
పేద ప్రజలు మూడు నెలలుగా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే... ఒక్కసారిగా విద్యుత్ బిల్లులు పెంచి భారం మోపడం దారుణమన్నారు. లాక్ డౌన్ అమలు చేసిన మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.