ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ తీరుపై తెదేపా నిరసన.. మండలికి సంకెళ్లతో లోకేశ్ - గుంటూరులో తెదేపా నిరసన ర్యాలీ

బలహీనవర్గాలపై దాడులు, శాసనసభలోకి మీడియా నియంత్రణను నిరసిస్తూ.. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. కొవిడ్ సేవలు అందించిన వైద్యులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 723 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

tdp protest on attacks in Guntur district
tdp protest on attacks in Guntur district

By

Published : Dec 3, 2020, 9:55 AM IST

Updated : Dec 3, 2020, 10:14 AM IST

బలహీనవర్గాలపై దాడులను నిరసిస్తూ తెదేపా ర్యాలీ

రాష్ట్రంలో వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను తెదేపా తీవ్రంగా ఖండించింది. శాసనసభలోకి మీడియా నియంత్రణను తప్పుబట్టింది. ఆయా విషయాలపై తమ నిరసన తెలుపుతూ.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలి నడకన వెళ్లారు. కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ముందుండి నడిచారు. ఎమ్మెల్సీ, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. చేతికి సంకెళ్లు వేసుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఏడాదిన్నరగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

కోవిడ్ సేవలు చేసిన వైద్యులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని.. వైద్యులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 723 జీవో ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో జరిగిన విషయాలను ప్రజలకు తెలియనివ్వకుండా మీడియాను ఎందుకు నియంత్రించారని వైకాపా ప్రభుత్వాన్ని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని.. ప్రాథమిక హక్కులు పరిరక్షించాలని.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని.. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలని.. నినదించారు. బ్యానర్లు ప్రదర్శించారు.

Last Updated : Dec 3, 2020, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details