ఇవీ చదవండి
గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు - tdp protest on amaravathi
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ... గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, మద్దాలి గిరిధర్, జీవీ ఆంజనేయలు పాల్గొన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రాజధాని భూముల విషయంలో అక్రమాలు జరిగి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోచ్చని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. అంతేకానీ భూములను త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. మరిన్ని వివరాలపై.. తెదేపా నాయకులతో ఈ టీవీ భారత్ ముఖాముఖి.
గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళనలు
TAGGED:
tdp protest on amaravathi