ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Protest Continues Against Chandrababu Arrest: రాష్ట్ర వ్యాప్తంగా ఆగని నిరసనల హోరు..చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్

TDP Protest Continues Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలు, జల దీక్షలు, పూజలు, ర్యాలీలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

TDP_Protest_Continues_Against_Chandrababu_Arrest
TDP_Protest_Continues_Against_Chandrababu_Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 7:18 AM IST

TDP Protest Continues Against Chandrababu Arrest: రాష్ట్ర వ్యాప్తంగా ఆగని నిరసనల హోరు..చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్

TDPProtest Continues Against Chandrababu Arrest :చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో తెలుగుదేశం నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మహిళలతో కలిసి పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొన్నారు. రేపల్లె దీక్షా శిబిరంలో బాబుతో మేము పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు.

TDP Cadre Protest in AP :పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కస్తాలలో తెలుగు మహిళ నాయకురాలు వేగుంట రాణి ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ పుట్టిపాటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాజిల్లా గన్నవరం దీక్షా శిబిరంలో... ఓ అభిమాని అరగుండుతో నిరసన తెలిపారు. కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద తెలుగుదేశం, జనసేన శ్రేణులు జలదీక్ష చేశారు.

TDP Candle Rally :గుడ్లవల్లేరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సైకో పోవాలి- సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ హిందువులు, ముస్లింలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సుల్తాన్ షాహిద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Agitation Continues Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఆగని నిరసనల హోరు.. చంద్రబాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలులో తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో సెల్ ఫోన్ లైట్లు వెలిగించి నిరసన తెలిపారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోరిలే నిరాహారదీక్ష కొనసాగుతున్నాయి.అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చెయ్యరు నది వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఇసుకలో మోకాళ్లపై బైఠాయించారు. తర్వాత చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ గుండ్లూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

YSR జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును విడుదల చేసే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీసత్య సాయి జిల్లా ఆగళి మండల కేంద్రంలో మోకళ్లపై బైఠాయించి బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ వద్ద తెలుగుదేశం నేత ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం నాయకులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గుత్తి మండలం తురకపల్లి కొవ్వొత్తుల ర్యాలీలో సైకో పోవాలి -సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. సింగనమల మండల కేంద్రం రంగరాయ చెరువులో జలదీక్ష చేపట్టారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

TDP Leaders Agitations Continues Against CBN Arrest బాబు కోసం కదిలుతోన్న ఊరూవాడా..'బాబుతో మేము సైతం' అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు


చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు అర్ధ నగ్నంగా ర్యాలీ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు.కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద అర్థనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఐటీడీపీ విభాగం, తెలుగుదేశం నాయకులు సయుక్తంగా నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు మద్దతుగా అమలాపురం దీక్షలో క్షత్రియ సామాజిక వర్గం నాయకులు పాల్గొన్నారు.

విశాఖలో TNSF రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో కొవ్వొతులు వెలిగించి నిరనస తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖ మాధవధార దీక్షా శిబిరం వద్ద అరగుండు గీయించుకున్నారు. చంద్రబాబు క్షేమం కోసం కంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అయ్యన్నపాలెంలో తెలుగు మహిళలు ర్యాలీ చేపట్టారు. అనంతరం చంద్రబాబు క్షేమం కోసం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాసాపేటలో మత్స్యకారులు దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలో బొబ్బిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ బేబీ నాయనా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ లబ్ధికోసం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దీక్షలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ధ్వజమెత్తారు. రాజాంలో కాలింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేశారు. దీక్షలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Huge Rally in Anantapuram Against CBN Arrest: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భారీ ర్యాలీ.. బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు

ABOUT THE AUTHOR

...view details