దళితులపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెదేపా నేత శైలజ అన్నారు. హోంమంత్రి దళితుల దాడులను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అంబేడ్కర్ వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
దళితులపై దాడులకు వ్యతిరేకంగా తెదేపా నిరసన - దళితులపై దాడులపై వార్తలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో అంబేడ్కర్ వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

tdp protest against attacks on daliths
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని శైలజ అన్నారు. ప్రశాంతంగా జీవించే హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మనసు మారి దళితులపై దాడులను చర్యలు చేపట్టాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు