ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHANDRABABU : ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత - sangam dairy case

తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP founder chandrababu naidu).. మంగళవారం గుంటూరు జిల్లా చింతలపూడిలో (chinthalapudi) పర్యటించనున్నారు. సంగం డెయిరీ కేసు (sangam dairy case)లో ఇటీవల జైలుకెళ్లి వచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర (dhoolipalla narendhra)ను ఆయన నివాసంలో పరామర్శించనున్నారు.

రేపు ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత
రేపు ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత

By

Published : Jul 12, 2021, 10:41 PM IST

Updated : Jul 13, 2021, 2:17 AM IST

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు తెదేపా సీనియర్ నేత, సంఘం డైరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని నరేంద్ర స్వగ్రామం చింతలపూడికి చంద్రబాబు వెళ్లనున్నారు.

సంగం డైరీలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన ఆయన విజయవాడ నుంచి ఇటీవలే స్వగ్రామం చింతలపూడి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్రను కలిసి అన్ని వేళల తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు చింతలపూడి వెళ్లుతున్నారు.

Last Updated : Jul 13, 2021, 2:17 AM IST

ABOUT THE AUTHOR

...view details