ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెట్టుబడుల సమీక్షలో.. సీఎం మాటలు బాధాకరం' - తెదేపాఎమ్మెల్యే మద్దాలి గిరిధర్

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తే... తాజాగా జరిగిన సదస్సులో సీఎం జగన్​ పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధంగా వ్యవహరించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

tdp preesmeet at tdp office in guntur district

By

Published : Aug 11, 2019, 4:15 PM IST

పెట్టుబడుల సమీక్షలో సీఎం మాటలు బాధాకరం..

ముఖ్యమంత్రి అనుభవారాహిత్యం, అజ్ఞానం పెట్టుబడుల సదస్సు ద్వారా వెల్లడైందని గుంటూరులో తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వ్యాఖ్యానించారు. ఏపీ తీరప్రాంతం గురించి చెప్పటంలో, పెట్టుబడులు ఆహ్వానించటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సదస్సుల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని... ఇప్పుడైతే పెట్టుబడులు పెట్టేవారిని బెదిరించేలా జగన్ వైఖరి ఉందన్నారు. ఏపీలో విమాన సర్వీసుల రద్దు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష వంటివి పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details