TDP Political Action Committee Meeting at NTR Bhavan:టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ ఈ నెల 9న అరెస్ట్ చేయడంతో లోకేశ్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామమిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 8న రాత్రి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో(Chandrababu arrest) పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు ఏర్పాటైన టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ తొలి సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగింది. దిల్లీలో ఉన్న లోకేశ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్రను కొనసాగించడం వంటి పలు కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ వ్యవహారాల నిర్వహణ, పర్యవేక్షణకు ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ఆదేశాలతో 14 మంది సభ్యుల్ని కమిటీలోకి తీసుకున్నారు. కార్యక్రమాల్ని, నేతల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ పార్టీకి మద్దతుగా వచ్చే రాజకీయ, ప్రజాపక్షాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరపనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో రాజకీయకక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును ఇరికించారని, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో జరిగిన వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో విస్త్రతంగా ప్రచారం చేసేలా కార్యచరణ ప్రణాళికను రూపొందించనుంది.
TDP Leader Ayyanna Fire on Kodali Nani: కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన.. అయ్యన్నపాత్రుడు
Lokesh Yuvagalam Padayatra:లోకేశ్ పాదయాత్రకు ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకున్న విషయాన్ని సమావేశంలో నేతలు చర్చించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ప్రజల ఆదరణతో ఇప్పటి వరకు పాదయాత్ర దిగ్విజయంగా జరిగిందని, ఇకపైనా అలాగే కొనసాగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తు అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. విపక్ష నాయకులు, కార్యకర్తలపై ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలు, అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని బలంగా ప్రజల్లో ఎండగట్టేందుకు, కలసి పోరాడేందుకు త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీలో ఎంతమంది సభ్యులుండాలి? ఎవరుండాలి? అన్న విషయాన్ని రెండు పార్టీల ముఖ్యనేతలతో మాట్లాడి నిర్ణయిస్తారు.