ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు రేంజ్ డీఐజీకి తెదేపా నేత వర్ల లేఖ... వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి - Varla Ramaiah latest news

గుంటూరు రేంజ్ డీఐజీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. దళిత కులానికి చెందిన రవికిరణ్‌ను దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని బకింగ్ హాం కాలువలో పడేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. త్వరగా రవికిరణ్ మృతదేహాన్ని గుర్తించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Varla Ramaiah
Varla Ramaiah

By

Published : Apr 6, 2022, 4:40 PM IST

దళిత కులానికి చెందిన నూతక్కి రవికిరణ్‌ హత్యపై గుంటూరు రేంజ్ డీఐజీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రవికిరణ్‌ను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి బకింగ్ హాం కాలువలో పడేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితులు లడ్డు అనబడే సముద్రాల పవన్ కుమర్, నన్నపనేని కృష్ణ చైతన్య, అత్తోట దీప్తి, మక్కెన వంశీ, పిల్లి రవికుమార్​లు అరెస్టు కాగా తూమాటి ప్రశాంత్ పరారీలో ఉన్నారని వర్ల లేఖలో పేర్కొన్నారు.

లడ్డు అనబడే సముద్రాల పవన్ కుమార్ ఇప్పటికే ఐదు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వర్ల ఆరోపించారు. నిందితులకు అధికార పార్టీ నుంచి మద్దతు ఉందని విమర్శించారు. వారిని విడుదల చేయాలని వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు.

వైకాపా నేతల ప్రభావంతో తమకు న్యాయం జరగదని రవికిరణ్ కుటుంబం ఆందోళన చెందుతోందని వర్ల స్పష్టం చేశారు. రవికిరణ్ మృతదేహం జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు మృతుడిని చివరి చూపు చూసేందుకు వీలులేకుండా పోయిందని బాధితు కుటుంబ సభ్యులు వాపోతున్నారన్నారు. త్వరగా రవికిరణ్ మృతదేహాన్ని గుర్తించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:Case on constable: కానిస్టేబుల్​పై కేసు నమోదు... కారణం అదే..!

ABOUT THE AUTHOR

...view details