తెదేపా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మూడో వంతు పదవులను యువత, మహిళలకు కేటాయించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 50 శాతం పదవులను వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని నేతలు తీర్మానం చేశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 17 శాతం ఆదాయం తగ్గిందని తెదేపా పోలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.
పరి'పాలన' స్తంభించింది
రాష్ట్రంలో పరిపాలన మొత్తం స్తంభించిపోయిందనే అభిప్రాయాన్ని పొలిట్ బ్యూరో వ్యక్తం చేసింది. తెదేపా హయాంలో 11 శాతం వృద్ధిరేటు సాధిస్తే... పూర్తిగా నాశనం చేసిందని నేతలు మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌ల స్నేహం వ్యక్తిగతమని అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు వారి వ్యక్తిగతం కాదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కలిసి పని చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతామంటే సహించేది లేదని నేతలు స్పష్టం చేశారు. వైకాపా విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లకపోగా... స్థానిక ఎంపీ బెదిరింపులకు దిగారని ఆరోపించారు.
ఆత్మహత్యలపై ఆవేదన