రాజధాని అమరావతిపై అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెదేపా సిద్ధమైంది. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో... తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అమరావతి శంకుస్థాపన అనంతరం అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్మాణాలను వివరించింది. ఎన్నికల నాటికి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరిస్తూ... ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫొటో ఎగ్జిబిషన్..! - విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫోటో ఎగ్జిబిషన్ వార్తలు
అమరావతి విషయంలో అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు తెదేపా సిద్ధమైంది. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో... తమ హయాంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించి తెదేపా ఫొటో ఎగ్జిబిషన్ తెదేపా ఏర్పాటు చేసింది.
విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాలయాలు అందుబాటులోకి తెచ్చిన తీరును ఈ ఎగ్జిబిషన్లో వివరించారు. 2019 ఎన్నికల సమయానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తాత్కాలిక భవనాలు, కొండవీటివాగు ఎత్తిపోతల పథకం, సీడ్‌యాక్సిస్ రహదారి వంటివి అందుబాటులోకి తెచ్చినట్లు ఈ ప్రదర్శన ద్వారా వివరించారు. అఖిలభారత సర్వీస్ అధికారుల భవనాలు, బలహీనవర్గాల కోసం చేపట్టిన గృహనిర్మాణం, గెజిటెడ్ అధికారుల గృహనిర్మాణం, మంత్రులు, జడ్జీలు, ఎన్జీవోల ఆవాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించే భవనాల వాస్తవ స్థితిగతులను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా చెప్పారు.
ఇవీ చూడండి..'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా'