'బోటు ఘటనలో ఏ1గా జగన్, ఏ2గా అవంతిని చేర్చండి' - తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ
కచ్చులూరు బోటు ప్రమాదంలో ఏ1 ముద్దాయిగా సీఎం జగన్, ఏ2 ముద్దాయిగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ను చేర్చాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
బోటు ప్రమాదంలో నిందితులుగా జగన్, అవంతిని చేర్చండి
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో సీఎం జగన్, మంత్రి అవంతి శ్రీనివాస్‌ను ఏ1, ఏ2 నిందితులుగా చేర్చాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. జగన్‌ను మంత్రి కన్నబాబు అభినందించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎంత మంది చనిపోయారో ప్రభుత్వం వద్ద స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం వల్లే బోటు బయటికి తీయడానికి 38 రోజులు పట్టిందన్నారు. బోటు ప్రమాదంపై విచారణ ఎంతవరకు వచ్చిందో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.