తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే మాఫియా కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని... తెదేపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 40 చోట్ల జరిగిన ఐటీ దాడుల్లో మొత్తం 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటిస్తే... అవన్నీ తెదేపాకు ఆపాదించే కుట్ర జరుగుతోందని మండిపడింది.
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల్లో ఏమీ దొరకలేదని తెలిపింది. శ్రీనివాస్ 9 నెలల కిందట రాజీనామా చేసి చంద్రబాబు ఆఫీసు నుంచి రిలీవ్ అయ్యారని గుర్తుచేసింది. వాస్తవానికి ఐటీ దాడులకు గురైన ఒక ఇన్‌ఫ్రా కంపెనీకి జగన్ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ ద్వారా కట్టబెట్టిందని ఆరోపించింది. ఐటీ దాడులకు గురైన సంస్థకు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను ఎలా అప్పగించిందని ప్రకటనలో నిలదీసింది.
బురద జల్లే ప్రయత్నం