ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదేమి కర్మ నినాదంతో.. ప్రజల్లోకి సరికొత్త కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి ,ప్రజా సమస్యలను రాత పూర్వకంగా తీసుకుని.. వాటిని భారీ వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి పంపేలా తెదేపా కార్యచరణ రూపోందిస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన నేడు జరగనున్న తెలుగుదేశం విసృత్తస్థాయి భేటీలో.. ఈ కార్యక్రమ తీరుతెన్నులను వివరించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటన విజయవంతంకావడంతో వచ్చే రెండు నెలలో 50కి పైగా నియోజకవర్గాలను చుట్టి రావాలని.. చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రజల్లో ఉండేలా... ఇదేమీ కర్మ..! కార్యక్రమం రూపొందించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా, నేతలను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.
రాష్ట్రానికి ఇదేమి కర్మ..! నినాదంతో తెదేపా సరికొత్త కార్యక్రమం
ప్రతిపక్ష తెదేపా మరో కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇదేమి కర్మ..! పేరుతో, రాష్ట్రప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రభుత్వంతో ప్రతి ఒక్కరు ఎలా నష్టపోయారో తెలిపే కార్యక్రమమే.. ఇదేమి కర్మ! కార్యక్రమమని, దీని ద్వారా అధికార వైకాపా నేతలకు చెక్ పెట్టాలని తెదేపా భావిస్తోంది.
తెదేపా సరికొత్త కార్యక్రమం
ఇవి చదవండి:
- పన్ను వసూళ్లలో పారదర్శకత లేదు.. అధికార్లపై ఫిర్యాదుల పర్వం
- పొలంలోకి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన ఏనుగు
- రామోజీ ఫిల్మ్‌సిటీలో పవన్ 'వీరమల్లు' షూటింగ్.. 'కాంతార' బ్యూటీ కొత్త మూవీ!