ఎన్ని కేసులు మెడకు చుట్టుకున్నా జగన్ రెడ్డి ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా విమర్శించారు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా.. ఖాళీకుర్చీలతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అందులో ఒకటి 2021 జూన్ 4న లక్ష రూపాయల పెట్టుబడితో రిజిస్టర్ అయిన కాజిస్ ఈ మోబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని తెలిపారు. ఏడాది కూడా కాని అనామకులు పెట్టిన ఈ కంపెనీ రాష్ట్రంలో రూ. 3వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని... ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారని మండిపడ్డారు.
ఎన్ని కేసులు మెడకు చుట్టుకున్నా.. మీ సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరా..?: లోకేశ్ - Nara Lokesh latest news
ఎన్ని కేసులు మెడకు చుట్టుకున్నా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన మనుషులు.. సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
![ఎన్ని కేసులు మెడకు చుట్టుకున్నా.. మీ సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరా..?: లోకేశ్ Nara Lokesh responds at Dubai Expo Meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14492298-408-14492298-1645087077039.jpg)
Nara Lokesh responds at Dubai Expo Meet
పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట అన్న లోకేశ్.. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా అంటూ ఎద్దేవా చేశారు. ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుందన్నారు. ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు.. చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు అంటూ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:తితిదే వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా..!