వైకాపా నాయకులపై ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెదేపా సభ్యులపై దౌర్జన్యం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మండలిలో లోకేశ్ ఆయన స్థానంలోనే ఉన్నారనీ... అక్కడకు మంత్రులు రావాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఇతరుల స్థానాల వద్దకు ఎందుకు వెళ్లారో మంత్రులు ఆలోచించాలని హితువు పలికారు. మహిళలు ఉన్నారనీ చూడకుండా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. తెలుగుదేశం సభ్యులపై దుర్భాషాలాడటమే కాకుండా... వాళ్లపైనా ఆరోపణలు చేస్తారా? అని దుయ్యబట్టారు.
వైకాపా మంత్రులపై తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజం - kanakamedala comments on govt
శాసన మండలిలో జరిగిన పరిణామాలపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. ఇతరుల స్థానాల వద్దకు మంత్రులు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలని హితువు పలికారు.
![వైకాపా మంత్రులపై తెదేపా ఎంపీ కనకమేడల ధ్వజం mp kanakamedala on ycp ministers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7680694-437-7680694-1592551043134.jpg)
వైకాపా మంత్రులపై కనకమేడల ధ్వజం
'రాజ్యసభలోనే ఎన్నో బిల్లు పాసు కాలేదు. కాబట్టి రాజ్యసభను రద్దు చేసేస్తారా? రాజ్యాంగం ప్రకారమే సభలు జరుగుతాయి. సొంత రాజ్యాంగాల ప్రకారం కాదు. ఏ సభల్లోనూ సభ్యులపై దాడులు చేయటం చూడలేదు.'-ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
ఇదీ చదవండి:హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ