ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్యపాన విధానం ముసుగులో దోపిడీ జరుగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై ఎక్సైజ్ మంత్రి ఎక్కడకు రమ్మంటే అక్కడకు చర్చకు వస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వం తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్.. ప్రతిపక్ష నాయకులపైనా కేసులు మోపేలా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. శాసన మండలి ఉన్నా లేకున్నా తనకు లెక్కలేదని.. మండలిలో వైకాపాకు 9 మందే సభ్యులున్నారని, వారిలో ఒక్కరు రాజీనామా చేసినా వెంటనే తాను రాజీనామా చేస్తానని వెంకన్న స్పష్టంచేశారు.
మద్యం పాలసీపై చర్చకు సిద్ధమా?: బుద్ధా - budha venkanna comments on ycp liquor policy
ముఖ్యమంత్రి జగన్ తనపై కేసులు ఉన్నందున ప్రతిపక్ష నాయకులపైనా కేసులు మోపేలా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న మద్యం విధానంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు.
'మద్యపాన నిషేధం కాదు.. వైకాపా నేతల దోపిడి రాజ్యం..'