వైకాపా అధికారంలోకి వచ్చాక పలువురు అధికారులను వీఆర్‌లో పెట్టి అష్టకష్టాలు పెడుతున్నారని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో ఆరోపించారు. పోస్టింగులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారని విమర్శించారు. వేతనాలు కూడా చెల్లించేది లేదని జీవో తీసుకొచ్చి వేధనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల విధుల్లో, బాధ్యతల్లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రజల కోసం పాటు పడితే వేటు పడుతుందేమో అనేంతలా భయపడే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. నిన్నటి వరకు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల ప్రాణాల తీసిన వైకాపా ఫ్యాక్షన్ కత్తిని.. నేడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రయోగించడం దారుణమని ధ్వజమెత్తారు. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో జనంతో మమేకమైన పోలీసుల్ని... నేడు జనం భయపడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.
ఎల్వీపై అందుకే వేటు